హనుమకొండ: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, మరణించిన వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆరోపణలపై హనుమకొండ జిల్లాకు చెందిన ఒక తాజా మాజీ కార్పొరేటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పార్కు కోసం కేటాయించిన స్థలంలో నిర్మించిన దేవాలయ భూమిని, సదరు మాజీ కార్పొరేటర్ తప్పుడు పత్రాల ద్వారా తన పేరు మీదికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు, అక్రమాలు నిజమేనని తేలడంతో కేసు నమోదు చేశారు.
ఈ మేరకు బాధ్యుడైన తాజా మాజీ కార్పొరేటర్‌పై BNS సెక్షన్లు 318, 336(3), 340(2), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


