ప్రముఖ యూట్యూబర్ నందనను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై లుక్ఔట్ నోటీసులు అమల్లో ఉండటంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విదేశాల నుంచి హైదరాబాద్కు వచ్చిన సమయంలో ఈ చర్య జరిగినట్లు తెలుస్తోంది.
ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగింత :
ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్న నందనను తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఆమెపై గతంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆమెను విచారించి కేసు దర్యాప్తును కొనసాగించనున్నారు.
లండన్ ఉద్యోగాల పేరుతో డబ్బుల వసూళ్లు? :
లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నందన, ఆమె భర్త పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బాధితుల ఫిర్యాదుల మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ కేసు నేపథ్యంలో నందన దంపతులపై పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేసారు. తాజాగా నందన ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారంతో RGIA పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు, నందనపై ఉన్న ఆరోపణలపై ఆమె స్పందన తెలియాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


