వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
శుక్రవారం అమావాస్య కాగా, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, మరియు సోమవారం వినాయకచవితి పండుగ సందర్భంగా మార్కెట్ మూసివేయననున్నట్లు వెల్లడించారు.
రైతులు ఈ విషయాన్ని గమనించి, ఈ నాలుగు రోజుల పాటు తమ వ్యవసాయ సరుకులను మార్కెట్కు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం నుండి మార్కెట్ కార్యకలాపాలు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


