హనుమకొండ: హనుమకొండలోని చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తిష్ఠ గణపతి నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఈ నవరాత్రి ఉత్సవాలు కొనసాగనున్నాయి.
ఈ ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ, నవరాత్రుల సందర్భంగా స్వామివారికి ప్రతిరోజూ విశేష కైంకర్యాలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23న గణపతి నిమజ్జనోత్సవం ఎంతో వేడుకగా జరగనుందని వెల్లడించారు. భక్తులందరూ ఈ పూజా కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మతో పాటు ఆలయ సిబ్బంది, పలువురు ముఖ్య నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


