ముంబైలో నిర్వహించిన అంతర్జాతీయ పర్యావరణ పరిజ్ఞాన ప్రదర్శన ‘IFAT India 2026’ సదస్సులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పట్టణ నీటి నిర్వహణ, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, బయోగాస్ ఉత్పత్తులు, ఈ-వేస్ట్ నిర్వహణ వంటి వివిధ విభాగాల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలను ఆయన పరిశీలించారు.
అనంతరం కమిషనర్ మాట్లాడూతూ.. అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా అమలు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. వరంగల్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహితమైన నగరంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


