తెలంగాణ శాసనసభ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సభలో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై విస్తృత చర్చలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ముఖ్యమంత్రి, మంత్రుల చేతుల మీదుగా కీలక బిల్లులు
ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన ప్రధాన బిల్లులను సభ ముందుకు తీసుకరానున్నారు.
పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. స్థానిక సంస్థల నిర్వహణను మరింత వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కూడా ముఖ్యమంత్రే అసెంబ్లీలో ప్రతిపాదించనున్నారు.
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఈ కీలక సవరణ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు.
అసెంబ్లీలో రెండు ప్రధాన అంశాలపై స్వల్పకాలిక చర్చలు
బిల్లుల ప్రవేశంతో పాటు నేటి సమావేశాల్లో రెండు కీలక అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
రాబోయే జాతీయ జనగణనలో బీసీ, ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలనే అంశంపై సభలో సమగ్ర చర్చ జరగనుంది.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం, ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, విద్యా సంబంధిత అంశాలపై మరో స్వల్పకాలిక చర్చ నిర్వహించనున్నారు.
ఐదో రోజు సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందని, బిల్లుల ఆమోదం సహా చర్చల్లో ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్పట్లు సమాచారం.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


