బిగ్ బాస్ రియాలిటీ షోకు దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాష ఏదైనా ఈ షోకు భారీగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం హిందీలో 20వ సీజన్, తెలుగు, తమిళంలో 10వ సీజన్, మలయాళంలో 9వ సీజన్, కన్నడలో 13వ సీజన్ ప్రసారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా భాషల్లో షోకు హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న స్టార్ హీరోల పారితోషికంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
సల్మాన్ ఖాన్‌కు రూ.120 కోట్లు? :
హిందీ బిగ్ బాస్‌కు సల్మాన్ ఖాన్ చాలా కాలంగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా సీజన్ కోసం ఆయనకు దాదాపు రూ.120 కోట్ల వరకు పారితోషికం అందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో వీకెండ్ ఎపిసోడ్‌కు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
నాగార్జునకు భారీ రెమ్యునరేషన్ :
తెలుగు బిగ్ బాస్‌కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్నారు. మూడో సీజన్‌కు సుమారు రూ.10 కోట్లు తీసుకున్న ఆయన.. ప్రస్తుతం పదో సీజన్ కోసం దాదాపు రూ.42 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇతర భాషల్లోనూ కోట్లలోనే :
తమిళంలో కమల్ హాసన్ తర్వాత హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్ సేతుపతి సుమారు రూ.75 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం ఉంది. మలయాళంలో మోహన్‌లాల్‌కు రూ.35 కోట్లు, కన్నడ బిగ్ బాస్ 13వ సీజన్‌కు కిచ్చా సుదీప్‌కు సుమారు రూ.22 కోట్ల పారితోషికం అందుతున్నట్లు సమాచారం.
హోస్ట్దీ కీలక పాత్రే:
కంటెస్టెంట్లను నడిపించడంతో పాటు వివాదాలను పరిష్కరించడం, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో హోస్ట్ పాత్ర ఎంతో కీలకం. అందుకే స్టార్ హీరోలకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ పారితోషికాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెమ్యునరేషన్లపై అధికారిక ప్రకటనలు లేవు. ఇవన్నీ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వివరాలే.


