రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికీ “30 శాతం కమిషన్ సర్కార్” అని, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోందని బిఆర్ఎస్ విమర్శించింది. ఈ విషయాలను సామాజిక మాధ్యమం X వేదికగా కేటీఆర్ తెలిపారు.
22A, కాంగ్రెస్ భూ స్కామ్లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పలు అంశాలను బహిర్గతం చేసినట్లు పేర్కొన్నారు.
ప్రధాన ఆరోపణలు మరియు ముఖ్యాంశాలు:
• నిన్నటివరకు సొంత ఆస్తిగా ఉన్న భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్లు, పొలాలు మరియు కాలనీలను ప్రభుత్వం ఒక్క కలం పోటుతో అడ్డగోలుగా 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిందని ఆరోపించారు.
దీనివల్ల ప్రజలు ఇల్లు కట్టుకోలేక, ఆస్తులు అమ్ముకోలేక, బ్యాంక్ రుణాలు కూడా పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక్క గీతతో లక్షలాది మంది ఆస్తుల విలువను సున్నా చేశారని మండిపడ్డారు.
• పసుమాములలో రేవంత్ రెడ్డి సోదరుడి భూ ఆక్రమణకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఆమోదం తెలిపారని, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరిట 373 ఎకరాల భూమి ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
• రాష్ట్రవ్యాప్తంగా ఆసిఫాబాద్ నుంచి హైటెక్ సిటీ దాకా ఎక్కడ చూసినా నిషేధం మాటలే వినిపిస్తున్నాయని విమర్శించారు.
• రియల్ ఎస్టేట్ వ్యాపారులైన రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గద్దెనెక్కిన తర్వాత ప్రజల భూములపై గద్దల్లా వాలుతున్నారని, పాలకుల్లా ప్రజా ఆస్తులను రక్షించాల్సింది పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
• “రాజ్యమంటే భూమి కాదు.. భూమిపై బతికే మనుషులు” అనే విషయాన్ని కాంగ్రెస్ మర్చిపోయిందని, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నట్లుగా రేవంత్ రెడ్డి భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు.
లగచర్ల నుంచి హిల్ట్ పాలస్ వరకు అన్నీ కుంభకోణాలేనని, రేవంత్ రెడ్డి ప్రతి నిర్ణయం వెనుక భూ వ్యామోహమే ఉందంటూ ధ్వజమెత్తారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


