కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ భార్య మీడియా ముందుకు వచ్చి తన ఆవేదనను వ్యక్తం చేశారు. సుమంత్ విషయంలో అనవసర ప్రచారాలు వద్దని, కేవలం వాస్తవాలను మాత్రమే మీడియా సమాజానికి తెలియజేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కుటుంబం తీవ్ర మనోవేదన
సుమంత్ లైఫ్ ఇప్పటికే నాశనమైందని, తమ కుటుంబాన్ని తీవ్రంగా టార్చర్ చేస్తున్నారని ఆమె వాపోయారు. కేసుల కారణంతో తమ కుటుంబం తీవ్రంగా డిస్టర్బ్ అయిందని తెలిపారు. ఈ పరిణామాల వల్ల ఎదురైన ఒత్తిడిని తట్టుకోలేక తన మామగారు ఆత్మహత్యాయత్నం చేశారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమ కుటుంబానికి ఒక తీవ్రమైన బ్రేకింగ్ పాయింట్‌గా మారిందని చెప్పారు.
కార్పొరేట్ ఉద్యోగం వదులుకుని…
సుమంత్ ఐఐఎంలో ఉన్నత చదువులు పూర్తి చేశారని, మంచి భవిష్యత్తు ఉన్న కార్పొరేట్ రంగాన్ని కాదనుకుని సురేఖ వద్ద OSDగా బాధ్యతలు నిర్వహించారని ఆమె గుర్తుచేశారు. ఈ వివాదాలన్నింటి వల్లే రాజకీయం, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకుని ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటున్నా ఇప్పటికీ తమకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోయారు.
బంధువులకు పోలీసుల వేధింపులు
సుమంత్ వ్యవహారంలో తమకు సంబంధించిన చాలా మంది బంధువులను కూడా పోలీసులు తీవ్రంగా టార్చర్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మీడియా వారు నిజా నిజాలు తెలుసుకుని, వాస్తవాలను మాత్రమే ప్రచారం చేయాలని ఆమె కోరారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


