సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి రెట్రో లుక్‌లో ఫొటోలను రూపొందించే ఏఐ ట్రెండ్ విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణ ఫొటోలను పాతకాలపు పోర్ట్రెయిట్స్గా మార్చుకోవడం వినియోగదారులకు సరదాగా అనిపిస్తోంది. అయితే ఒక్క క్లిక్‌తో క్షణాల్లో తయారయ్యే ఈ ఏఐ చిత్రాల వెనుక భారీ మౌలిక వసతులు, విద్యుత్ వినియోగం, నీటి అవసరం దాగి ఉన్నాయి.
విద్యుత్ వినియోగం పెరుగుదల :
యూనివర్సిటీ అంచనాల ప్రకారం ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ డేటా సెంటర్ల విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరగనుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఏఐ టూల్స్‌ను ఫొటోలు, వీడియోలు, ఇతర కంటెంట్ కోసం ఉపయోగిస్తున్నారు. ఫలితంగా డేటా సెంటర్లపై శక్తి అవసరం మరింత పెరుగుతోంది.
నీటి వినియోగం కూడా కీలకమే :
ఏఐ డేటా సెంటర్లలో పనిచేసే సర్వర్లను చల్లబరచేందుకు పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుంది. ఒక ఏఐ ఫొటో తయారీలో వినియోగించే నీరు తక్కువగానే కనిపించినా, కోట్లాది జనరేషన్లు కలిస్తే దాని ప్రభావం గణనీయంగా ఉంటుంది. క్లిష్టమైన వీడియోలను రూపొందించడానికి మరింత వనరులు అవసరమవుతాయి.
‘రీబౌండ్ ఎఫెక్ట్’తో మరింత భారం :
ఏఐ టెక్నాలజీ సులభంగా, చౌకగా అందుబాటులోకి రావడంతో వినియోగం కూడా వేగంగా పెరుగుతోంది. ఒక ఫొటో తర్వాత మరో ఫొటో, కొత్త హెయిర్‌స్టైల్, బ్యాక్‌గ్రౌండ్ మార్పులు, వీడియో జనరేషన్ వంటి ప్రయోగాలు పెరుగుతున్నాయి. దీనినే ‘రీబౌండ్ ఎఫెక్ట్’గా పిలుస్తారు.
ఈ-వేస్ట్ కూడా సమస్యే :
ఏఐ ప్రభావం విద్యుత్, నీటితో మాత్రమే ఆగదు. అధునాతన చిప్స్ తయారీ, కీలక ఖనిజాల తవ్వకాలు, పాత పరికరాల తొలగింపుతో ఈ-వేస్ట్ కూడా పెరుగుతోంది. అందువల్ల వైరల్ ఏఐ ట్రెండ్స్‌ను ఆస్వాదించడంతో పాటు వాటి పర్యావరణ ప్రభావాన్ని గుర్తించడం కూడా అవసరమే.


