హనుమకొండ: హనుమకొండ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సమాచారం ప్రకారం, హనుమకొండ సుబేదారిలోని అటవీ శాఖ కార్యాలయం (ఫారెస్ట్ ఆఫీస్) సమీపంలో సుమారు సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్న చెట్టుకు సదరు యువకుడు ఉరివేసుకున్నాడు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగినప్పటికీ, తొలుత ఎవరి దృష్టికీ రాకపోవడం గమనార్హం.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సుబేదారి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మృతుడు ఎవరు? అతడి ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటి? అనే విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రద్దీగా ఉండే రోడ్డుపై యువకుడు ఇలా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర భయాందోళనలను, దిగ్భ్రాంతిని కలిగించింది.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


