HomeLatest Newsఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Published on

spot_img

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చర్చ జరిగింది. వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో భాగంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని తెరిపారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు వరి, పత్తి పంటలకు బదులుగా ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపుతున్నారని, అయితే గెలలు నరికిన 24 గంటల్లోపు ప్రాసెసింగ్ చేయకపోతే పంట నాణ్యత దెబ్బతింటుందని తెలిపారు. స్థానికంగానే ఫ్యాక్టరీ ఉంటే రైతులకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని వివరించారు. కావున ప్రభుత్వం వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.

ఎమ్మాల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందిస్తూ శాసనసభలో సమాధానమిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ములుగు జిల్లా ఇంచెర్ల, భూపాలపల్లి జిల్లా చైన్‌పాక ప్రాంతాల్లో ఇప్పటికే ఆయిల్ ఫామ్ మిల్లుల ఏర్పాటు పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. వచ్చే సంవత్సర నాటికి ఈ మిల్లులు రైతులకు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తోందని, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.