HomeLatest Newsకేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఇక PF జీత పరిమితి రూ.25 వేలకు పెంపు!

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. ఇక PF జీత పరిమితి రూ.25 వేలకు పెంపు!

Published on

spot_img

ఈపీఎఫ్ వేతనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేల పరిమితిని రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పుతో సుమారు 51 లక్షల మంది కొత్తగా ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.

2014 తర్వాత తొలిసారి పెంపు :

ప్రస్తుతం నెలకు రూ.15 వేల వరకు వేతనం పొందే ఉద్యోగులకు ఈపీఎఫ్ కవరేజీ వర్తించే నిబంధనలు ఉన్నాయి. అయితే ఈ పరిమితిని ప్రభుత్వం 2014లో చివరిసారిగా సవరించింది. అప్పటి నుంచి వేతనాలు, ఉద్యోగుల ఆదాయాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకుని పరిమితిని రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించినట్లు కేంద్రం తెలిపింది.

పీఎఫ్‌తో సామాజిక భద్రత :

వేతన పరిమితి పెరగడంతో మరింత మంది ఉద్యోగులు పీఎఫ్ సేవింగ్స్‌తో పాటు పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు నెలకు రూ.15,000కు మించి వేతనం పొందుతూ కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిలో కొందరు ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌ పరిధిలోకి రాలేకపోతున్నారు. దీంతో వారికి ప్రావిడెంట్ ఫండ్‌తో పాటు పెన్షన్, ఈడీఎల్‌ఐ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి.

తాజా నిర్ణయంతో ఈ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచనున్నారు. ఫలితంగా రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య నెలవారీ వేతనం పొందే కొత్త ఉద్యోగులు కూడా ఈపీఎఫ్‌ఓ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వారికి పీఎఫ్, పెన్షన్, ఈడీఎల్‌ఐ వంటి ప్రయోజనాలు అందుబాటులోకి వస్తాయి.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మార్పుతో దేశవ్యాప్తంగా 51 లక్షలకు పైగా అదనపు ఉద్యోగులు ఈపీఎఫ్‌ఓ సామాజిక భద్రతా పరిధిలోకి చేరనున్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు రూ.11,339 కోట్లను ఖర్చు చేయనుంది.

కోట్లాది మంది సభ్యులు :

ఈపీఎఫ్ఓ గణాంకాల ప్రకారం ప్రస్తుతం సుమారు 7.98 కోట్ల మంది పీఎఫ్ సభ్యులు ఉన్నారు. వీరిలో దాదాపు 82 లక్షల మందికి పీఎఫ్ పెన్షన్ సదుపాయం అందుతోంది. కొత్త వేతన పరిమితి అమల్లోకి వస్తే ఈపీఎఫ్ పరిధి మరింత విస్తరించే అవకాశం ఉంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.