HomeLatest Newsఒక్క వ్యక్తికి 2 వేల ఎకరాలా..? శంషాబాద్ భూములపై రేవంత్ విస్మయం!

ఒక్క వ్యక్తికి 2 వేల ఎకరాలా..? శంషాబాద్ భూములపై రేవంత్ విస్మయం!

Published on

spot_img

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మైహోం సంస్థకు సంబంధించిన భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శంషాబాద్ పరిధిలో మైహోంకు భారీగా భూములు ఉన్నాయని ప్రస్తావిస్తూ.. ఎయిర్‌పోర్టుకు ఆనుకుని ఒక వ్యక్తికి 2,463 ఎకరాలు ఎలా వచ్చాయని..? ప్రశ్నించారు. మైహోం ఎవరి బినామీ సంస్థో తెలియదా..? అంటూ సభలో సభ్యులను ప్రశ్నించారు.

భూముల కేటాయింపుపై ఆరోపణలు :

కాప్రా ప్రాంతంలోని ఎవాక్యూ భూములను మైహోంకు కట్టబెట్టారని సీఎం ఆరోపించారు. అలాగే మేళ్లచెరువులోని భూదాన్ భూములను కూడా మైహోం పేరుతో పట్టా చేశారని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాత మేళ్లచెరువు భూములను మైహోం సంస్థకు సంబంధించిన పేర్లతో నమోదు చేసినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు.

28 కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్లు:

శంషాబాద్ పరిధిలోని ఐదు గ్రామాల్లో పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి, వాటిని 28 వేర్వేరు కంపెనీల పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం సభలో వివరించారు. అసైన్డ్ భూములతో పాటు పేదలకు చెందిన భూములు కూడా మైహోం చేతుల్లోకి వెళ్లాయని ఆయన ఆరోపించారు.

కేసీఆర్‌పై సీఎం విమర్శలు :

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు తమ ఆస్తులను కోల్పోయారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే కేసీఆర్ మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని సీఎం ఆరోపించారు. అసెంబ్లీలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.