ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించిన భూముల వివరాలు కొత్తవేమీ కావు అని, తమ ఎన్నికల అఫిడవిట్లో ముందే పొందుపరిచిన భూముల్నే సీఎం సభలో చూపించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఏకంగా 308 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. రేవంత్ కుటుంబసభ్యులకు చెందిన భూముల పక్క నుంచే ప్రతిపాదిత బుల్లెట్ ట్రెయిన్ అలైన్మెంట్ వెళ్తోందని, ఇందులో పెద్ద ఎత్తున ప్రయోజనం పొందేందుకు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రధాన ముఖ్యాంశాలు:
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో 308 ఎకరాల భారీ భూప్యాకేజీ ఉందన్న హరీశ్ రావు. ఆ భూముల సమీపం నుంచే బుల్లెట్ ట్రెయిన్ అలైన్మెంట్ వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు.
భూభారతి వ్యవస్థ ద్వారా 9,200కు పైగా అక్రమ లావాదేవీలు మరియు భూకేటాయింపులు జరిగాయని మండిపడ్డారు.
22A నిషేధిత భూముల జాబితాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దకుండా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
సామాన్య ప్రజలు, రైతుల భూములకు రక్షణ లేకుండా పోయిందని, నిషేధిత జాబితా పేరుతో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం… తమ స్వంత లబ్ధి కోసం అలైన్మెంట్లు మార్చుకుంటోందని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


