హనుమకొండ: హనుమకొండలోని డీసీసీ భవనంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్లు ముఖ్య అతిథులుగా హాజరై జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి ఎందరో వీరుల త్యాగాలు కారణమన్నారు. నాటి విమోచన పోరాటం నుండి నేటి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ముందుందని తెలిపారు. స్వార్థ రాజకీయాల కోసం కొందరు చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమానికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


