హనుమకొండ: ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు.
జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి, జెండా వందనం సమర్పించారు.
ఈ వేడుకల్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, అదనపు కమిషనర్ ఇసంపల్లి జోనా, వివిధ విభాగాల అధికారులు మరియు సిబ్బంది విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


