హనుమకొండ: పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ అందించేందుకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
సెప్టెంబర్ 20న స్క్రీనింగ్ టెస్ట్ :
ఉచిత పోలీసు కోచింగ్‌కు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు 2026 సెప్టెంబర్ 20న ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష కొనసాగుతుంది. పోలీసు నియామక పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఐదు కేంద్రాల్లో పరీక్ష :
అభ్యర్థుల సౌకర్యార్థం మొత్తం ఐదు ప్రాంతాల్లో స్క్రీనింగ్ టెస్ట్‌కు ఏర్పాట్లు చేశారు.
*వరంగల్: CKM కాలేజీ, దేశాయిపేట
*హనుమకొండ: SVS కాలేజీ, రామారం
*జనగామ: CJIT ఇంజినీరింగ్ కాలేజీ, యశ్వంత్‌పూర్ క్రాస్‌రోడ్
*పరకాల: ప్రభుత్వ జూనియర్ కాలేజీ
*నర్సంపేట: BITS కాలేజీ, లక్నేపల్లి
*గూగుల్ ఫామ్ ద్వారా నమోదు
స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా తమ వివరాలను గూగుల్ ఫామ్‌లో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం నిర్వాహకులు అందించిన https://forms.gle/eD2E5jNfiebo5prG8 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోలీసు ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు గడువులోగా వివరాలు నమోదు చేసుకుని పరీక్షకు హాజరు కావాలని నిర్వాహకులు సూచించారు.


