దేశవ్యాప్తంగా LPG వినియోగదారులకు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు రానున్నట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియ తప్పనిసరి కానుంది. ముఖ్యంగా సబ్సిడీ ప్రయోజనం పొందుతున్న వినియోగదారులు ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
ప్రతి రీఫిల్‌కు ఆధార్ ధృవీకరణ :
ఇప్పటివరకుLPG కనెక్షన్ తీసుకునే సమయంలో లేదా కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆధార్ వివరాలను ధృవీకరించే విధానం ఉండేది. అయితే కొత్త విధానంలో ప్రతి రీఫిల్‌కు ముందు వినియోగదారుడి ఆధార్‌ను అథెంటికేట్ చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా గ్యాస్ కనెక్షన్లను సంబంధిత వినియోగదారులతో అనుసంధానం చేయడంతో పాటు, సబ్సిడీ ప్రయోజనాలు అర్హులైన వారికి మాత్రమే అందేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
సబ్సిడీ పొందేవారికి ముఖ్యమైన నిబంధన :
ప్రభుత్వ సబ్సిడీతో LPG సిలిండర్ పొందుతున్న వినియోగదారులు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవడం అవసరం. అథెంటికేషన్ ప్రక్రియ పూర్తికాకపోతే సబ్సిడీ ప్రయోజనంపై ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని సంబంధిత వర్గాలు సూచిస్తున్నాయి.
ముందుగానే వివరాలు చెక్ చేసుకోండి :
వినియోగదారులు తమ LPG కనెక్షన్‌కు ఆధార్ వివరాలు సరిగ్గా అనుసంధానమై ఉన్నాయో లేదో ముందుగానే పరిశీలించుకోవడం మంచిది. ఆధార్‌లోని పేరు, మొబైల్ నంబర్ వంటి వివరాల్లో మార్పులు ఉంటే సంబంధిత గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి అవసరమైన సవరణలు చేసుకోవాలని సూచిస్తున్నారు.


