HomeWarangal Newsఆ పేరు పెడితే వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు మరింత క్రేజ్.. విజయ్ దేవరకొండ సూచన ఇదే!

ఆ పేరు పెడితే వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు మరింత క్రేజ్.. విజయ్ దేవరకొండ సూచన ఇదే!

Published on

spot_img

వరంగల్‌లో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. తాజాగా ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. వరంగల్‌లో నిర్మించనున్న విమానాశ్రయానికి ఎలాంటి పేరు పెట్టాలనే దానిపై ప్రజలు తమ సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా వరంగల్‌ ఎయిర్‌పోర్టు కల త్వరలో సాకారం కానుందని ఆయన శనివారం ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.

‘కాకతీయ’ పేరుకు మద్దతు :

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వరంగల్ ఎయిర్‌పోర్టుకు ‘రుద్రమదేవి’ లేదా ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ వంటి పేర్లను పరిశీలించాలని సూచింchaaru. వరంగల్‌కు కాకతీయుల చరిత్రతో ఉన్న బలమైన అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి పేర్లు ప్రాంతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన అభిప్రాయం.

విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు :

ఈ ప్రతిపాదనపై హీరో విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. సందీప్ రెడ్డి వంగా సూచించిన పేర్లు తనకు నచ్చాయని ఆయన పేర్కొన్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలకు ఆ వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. “పవర్‌ఫుల్ ప్రాంతాలకు పవర్‌ఫుల్ పేర్లు ఉండాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

సమ్మక్క-సారక్క పేరు కూడా తెరపైకి :

మరోవైపు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల భిన్నమైన ప్రతిపాదన చేశారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక గుర్తింపులో ప్రత్యేక స్థానం ఉన్న సమ్మక్క-సారక్క పేర్లను ఎయిర్‌పోర్టుకు పెట్టాలని సూచించారు.

తుది నిర్ణయం అధికారికంగానే :

ఇలా కాకతీయుల వారసత్వాన్ని ప్రతిబింబించే పేర్లతో పాటు సమ్మక్క-సారక్క పేరుపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఎయిర్‌పోర్టు పేరుపై తుది నిర్ణయం మాత్రం సంబంధిత అధికారిక ప్రక్రియలోనే తీసుకోవాల్సి ఉంటుంది.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles