తెలంగాణలోని రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివిధ సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ‘ఫార్మర్ రిజిస్ట్రీలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఫార్మర్ రిజిస్ట్రీ ఐడీ ద్వారా అర్హులైన నిజమైన రైతులకు ఏడాదికి ₹6,000 అందించే ‘పీఎం కిసాన్’ వంటి పథకాల ఫలాలు సులభంగా అందుతాయని అధికారులు తెలిపారు.రిజిస్ట్రేషన్ వివరాలు:
రిజిస్ట్రేషన్ వివరాలు:
కావాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డ్, పట్టాదారు పాస్ బుక్, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్.
ఎక్కడ నమోదు చేసుకోవాలి?
సమీపంలోని మీసేవ కేంద్రంలో గానీ లేదా ఏఈఓ దగ్గర గానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
ముగింపు తేదీ:
ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన రైతులందరూ వెంటనే నమోదు చేసుకోవాలని కోరారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


