ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచగా, ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు.
ఏసీబీ సోదాలు – స్వాధీనం చేసుకున్న సొత్తు:
డాక్టర్ లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు మొత్తం 8 ప్రాంతాల్లో (ఆయన నివాసం + మరో 7 చోట్ల) ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో రూ.6.13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
- నగదు & డిపాజిట్లు:
- రూ. 35 లక్షల నగదు
- బ్యాంకు ఖాతాల్లో రూ. 41 లక్షలు
- మ్యూచువల్ ఫండ్లలో రూ. 29.55 లక్షల పెట్టుబడులు
- పోస్టాఫీసుల్లో రూ. 12 లక్షల డిపాజిట్లు
- బంగారం: 517.8 గ్రాముల బంగారు ఆభరణాలు
- స్థిరాస్తులు:
- హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4 BHK ఫ్లాట్
- కూకట్పల్లిలో 2 (మూడు-BHK) ఫ్లాట్లు
- మణికొండ, పేటబషీరాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో 5 (రెండు-BHK) ఫ్లాట్లు
- యాదాద్రి, నందిగామ, షమీర్పేటలలో 4 ఖాళీ ప్లాట్లు
- విశాఖపట్నంలో 800 చదరపు గజాల ప్లాట్
Read Warangal News and Latest Politics News and Real Estate


