HomeLatest NewsJNAFAUలో MFA కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..!

JNAFAUలో MFA కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్..!

Published on

spot_img

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (JNAFAU) 2026 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఫుల్‌టైమ్ సెల్ఫ్‌ ఫైనాన్స్ మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (MFA) కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో మొత్తం 56 సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాల వారీగా సీట్ల వివరాలు :

MFA – అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్: 20 సీట్లు
MFA – ఫొటోగ్రఫీ అండ్ మీడియా కమ్యూనికేషన్: 15 సీట్లు
MFA – పెయింటింగ్: 15 సీట్లు
MFA – స్కల్ప్చర్: 6 సీట్లు

విద్యార్హతలు :

సంబంధిత విభాగంలో నాలుగేళ్ల BFA లేదా సమానమైన కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫొటోగ్రఫీ కోర్సుకు మాత్రం మూడేళ్ల BFAతో పాటు మూడు సంవత్సరాల సంబంధిత పని అనుభవం ఉన్నవారు కూడా అర్హులు.

ఎంపిక విధానం :

అభ్యర్థులకు రాత పరీక్ష, ప్రాక్టికల్/పోర్ట్‌ఫోలియో, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష, ఇతర ప్రక్రియలు JNAFAU క్యాంపస్‌లోనే నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పేర్కొంది.

దరఖాస్తు విధానం :

అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, దరఖాస్తు ఫీజు డీడీని మాసబ్ ట్యాంక్‌లోని JNAFAU క్యాంపస్లోని యూనివర్సిటీ కార్యాలయంలో సమర్పించాలి. స్కల్ప్చర్ కోర్సుకు దరఖాస్తు చేసేవారు 5×7 అంగుళాల పరిమాణంలో అటెస్టెడ్ పాస్‌పోర్ట్ ఫొటోలు రెండు జతచేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ :

అభ్యర్థులు అక్టోబర్ 12, 2026లోగా దరఖాస్తులను సమర్పించాలి. ఆలస్యంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉంది. రూ.2,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.