HomeLatest Newsనెలనెలా ‘ఈఎంఐ’ రూపంలో లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన సీడీపీవో

నెలనెలా ‘ఈఎంఐ’ రూపంలో లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన సీడీపీవో

Published on

spot_img

ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగే పద్ధతుల్లో అవినీతి అధికారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి నెలవారీ వాయిదాల పద్ధతిలో లంచం వసూలు చేస్తున్న జగిత్యాల జిల్లా మెట్‌పల్లి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ దారోజు పద్మను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఘటన వివరాలు

మెట్‌పల్లి పట్టణ పరిధిలో మొత్తం 21 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. తనిఖీల్లో ఎలాంటి ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు, ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఇవ్వాలని సీడీపీవో పద్మ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మొత్తం 21 మంది నిర్వాహకుల నుంచి మూడు నెలలకు సంబంధించిన మొత్తం రూ.63,000 లంచం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు, కార్యాలయం వద్ద ఫిర్యాదుదారుల నుంచి రూ.63,000 నగదు తీసుకుంటుండగా సీడీపీవో పద్మను పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.