ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
కాజీపేట మండలం మడికొండ పరిధిలో క్రైస్తవ, ముస్లిం స్మశాన వాటికల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో కలిసి భూ రికార్డులు, మ్యాప్‌లను పరిశీలించిన ఆమె, సంబంధిత స్థల వివరాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను గుర్తించి తక్షణమే హద్దులు నిర్ణయించడంతో పాటు, అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲


