HomeLatest Newsఅక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు

అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు

Published on

spot_img

ప్రజల రోజువారీ ఆర్థిక కార్యకలాపాలు, ప్రభుత్వ సేవలపై ప్రభావం చూపేలా అక్టోబర్ నెల నుంచి పలు కీలక నిబంధనల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, బ్యాంకింగ్ లావాదేవీలు, జనన-మరణ ధ్రువీకరణ పత్రాల జారీ వరకు పలు అంశాల్లో నూతన విధానాలు అమల్లోకి రానున్నాయి.

ప్రధాన మార్పులు ఇవే:

బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్లు అందుతాయి. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు సబ్సిడీని కోల్పోయే అవకాశం ఉంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి నిర్దేశిత యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

అక్టోబర్ 15వ తేదీ నుంచి నిర్దేశిత యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

బ్యాంకులు తమ బల్క్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల లోపు తప్పనిసరిగా వెల్లడించాలి. అలాగే ఒకే డిపాజిట్ కేటగిరీకి సంబంధించి కస్టమర్లను బట్టి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేయడంపై నిషేధం ఉంటుంది.

జనన లేదా మరణ ధ్రువీకరణ పత్రాల కోసం నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత—ఏడాదికి మించి ఆలస్యంగా దరఖాస్తు చేసుకుంటే అదనపు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సర్టిఫికెట్ జారీ అవుతుంది.

సామాన్య ప్రజలు, వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వీలైనంత త్వరగా అవసరమైన కేవైసీ, దరఖాస్తు ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

𝗥𝗲𝗮𝗱 𝗪𝗮𝗿𝗮𝗻𝗴𝗮𝗹 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗟𝗮𝘁𝗲𝘀𝘁 𝗣𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝘀 𝗡𝗲𝘄𝘀 𝗮𝗻𝗱 𝗥𝗲𝗮𝗹 𝗘𝘀𝘁𝗮𝘁𝗲

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.