హసన్పర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు.
పాఠశాలలోని అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, కిచెన్ గార్డెన్, యోగా శిక్షణ షెడ్ తదితర వసతులను ఆమె పరిశీలించి, వాటి నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న ఉపయోగం గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు సాంకేతిక, సృజనాత్మక, ఆరోగ్యకరమైన అభ్యాస వాతావరణం కల్పించేందుకు పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.


