హనుమకొండ: హనుమకొండ జిల్లా హసన్పర్తిలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న అల్పాహారాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వారు పేర్కొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, తరగతి గదుల్లో ఏకాగ్రతతో చదువుకునేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


