వరంగల్: దేశవ్యాప్తంగా చేపట్టిన “సేవ్ డెమోక్రసీ వీక్ – ఓట్ బచావో – దేశ్ బచావో” (Save Democracy Week – Vote Bachao – Desh Bachao) కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలో INDIA కూటమి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
పోచమ్మైదాన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ
పోచమ్మైదాన్ కూడలి నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన వరంగల్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్లకార్డులు చేతబూని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు అనుకూలంగా నినాదాలు చేశారు.


