వరంగల్: వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించి అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.


