HomeLatest Newsఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్

ఏసీబీ వలలో అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్

Published on

spot_img

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ కార్యాలయంలో భారీ అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. లేఅవుట్ క్లియరెన్స్ నివేదిక కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహశీల్దార్ బోడ సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఇద్దరు అధికారులను ఏసీబీ బృందం అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకుంది.

రూ.30 లక్షల డిమాండ్.. రూ.20 లక్షలకు బేరం

ప్రైవేట్ భూమికి సంబంధించిన లేఅవుట్ అప్రూవల్ కోసం ఉమ్మడి తనిఖీ నివేదికను ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ శ్రీనివాసులు ద్వారా కెమికల్ పూసిన రూ.20 లక్షల నగదును తహశీల్దార్ సుదర్శన్ రెడ్డి స్వీకరిస్తుండగా దాడి చేశారు. అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షల్లో (ఫినాఫ్తలీన్ టెస్ట్) నిందితులు లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.

ఇళ్ళు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు

నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ బృందాలు అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంతో పాటు హైదరాబాద్, వరంగల్‌లోని వారి నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టాయి. సుదర్శన్ రెడ్డి గతంలో విధులు నిర్వహించిన ప్రాంతాల్లోనూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉండటంతో ఆస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్ల వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ అనంతరం ఇద్దరినీ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల విడాకులు.. 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

రైతులకు శుభవార్త.. ఎకరాకు రూ.12 వేల రైతు భరోసా సాయం జమ!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ.12,000 పెట్టుబడి సాయం అందిస్తోంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రైతులకు సందేశం పంపించారు.

దసరా వేళ తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు: 4 రోజుల్లోనే రూ.755 కోట్లు!

దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు నాలుగు రోజుల్లోనే రికార్డు స్థాయిలో రూ.755.14 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోగా, ఒక్క అక్టోబర్ 19నే రూ.303.40 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి.