HomeWarangal Newsఅర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై సమీక్ష.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధి

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై సమీక్ష.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగరాభివృద్ధి

Published on

spot_img

హనుమకొండ: అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ కింద చేపట్టనున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్‌)పై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి, సీడీఎంఏ డాక్టర్ టి.కె. శ్రీదేవి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణ, రవాణా ఆధారిత అభివృద్ధి, ప్రాంతీయ ప్రణాళిక, పట్టణ పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించారు.

అలాగే తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, నగర ప్రాంతాల పునరాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు, డీపీఆర్‌ల వివరాలను అధికారులు సమీక్షకు వివరించారు. నగరంలో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, భవిష్యత్ పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంపై దృష్టి సారించారు.

అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నగరాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంతో పాటు, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా సమగ్ర ప్రణాళికల రూపకల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు వివరించారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles