తొర్రూరు: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తొర్రూరులో తురుకా కాశ సంక్షేమ సంఘానికి చెందిన లబ్ధిదారులకు కటింగ్ మిషన్లు, జనరేటర్ కిట్లను పంపిణీ చేశారు.
మైనారిటీ వర్గాలకు చెందిన పేద కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ పరికరాల ద్వారా లబ్ధిదారులు ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కోరారు.


