HomeWarangal Newsఘనంగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభం

ఘనంగా 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్–2026 ప్రారంభం

Published on

spot_img

హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 (క్లస్టర్–డి) పోటీలు మంగళవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐజీ గజారావు భూపాల్, వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ, పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందించడంలో క్రీడలు కీలకమన్నారు.

నవంబర్ 3 నుంచి 5 వరకు మూడు రోజుల పాటు జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారంలోని ఎస్‌వీఎస్ కళాశాల మైదానాల్లో వివిధ పోటీలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన సుమారు 1,458 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles