వరంగల్: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వరంగల్ నగరంలో చేపట్టనున్న పలు అభివృద్ధి ప్రాజెక్టుల డీపీఆర్‌లపై కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ ఇషా కలియా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ టి. వెంకన్న పాల్గొన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయితో కలిసి పాల్గొన్న ఆయన, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, ఖిలా వరంగల్ మోటు అభివృద్ధి, వరంగల్ బస్ స్టేషన్, హనుమకొండ చౌరస్తా అభివృద్ధి, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తదితర ప్రాజెక్టుల సమగ్ర వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


