HomeWarangal Newsఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి

ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు 12 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తి

Published on

spot_img

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎస్సైలు, స్టేషన్ రైటర్లకు కేసుల దర్యాప్తు, కోర్టు విధానాలపై నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన 12 రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులు ముగిశాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అక్టోబర్ 22న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం నవంబర్ 4న ముగిసింది.

ఈ శిక్షణలో కేసుల దర్యాప్తు విధానం, శాస్త్రీయ ఆధారాల సేకరణ, సాక్షుల విచారణ, వివిధ శాఖల నుంచి అవసరమైన ఆధారాల సేకరణ, చార్జిషీట్ల తయారీ, కోర్టులో సాక్షుల హాజరు వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. పటిష్టమైన ఆధారాలతో కేసులను నిరూపించి నేరస్థులకు శిక్షలు పడేలా వ్యవహరించే విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మాట్లాడుతూ.. నాణ్యమైన దర్యాప్తు, పకడ్బందీగా ఆధారాల సేకరణ, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ద్వారా కేసులను పటిష్టంగా నిరూపించేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. అధికారుల పనితీరు, దర్యాప్తులో చూపే ప్రతిభ, కేసుల పరిష్కారంలో సాధించే ఫలితాల ఆధారంగా ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు, రివార్డులు అందజేస్తామని తెలిపారు.

దర్యాప్తులో ప్రతి అంశానికి ప్రాధాన్యతనిస్తూ, చట్టపరమైన విధానాలను ఖచ్చితంగా పాటించాలని పోలీసు అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, సీసీఆర్‌బీ ఏసీపీ డేవిడ్ రాజ్, సీసీఎస్ ఏసీపీ సదయ్య, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దామోదర్ రెడ్డితో పాటు ఇతర పోలీసు అధికారులు, ఎస్సైలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles