వరంగల్: నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులను కమిషనర్ టి. వెంకన్న పరిశీలించారు.
వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వెనుక ఉన్న సాయినగర్, ఏనుమాముల మార్కెట్ సమీపంలోని సుందరయ్య నగర్, హసన్‌పర్తి ఎర్రగట్టు గుట్ట ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టిన పనులను వేగవంతం చేస్తూ, నాణ్యత విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు.


