జనవరి 19, 2026:
తిరుమల శ్రీవారి ఏప్రిల్ మాసం ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ సోమవారం విడుదల చేయనుంది.
భక్తులు జనవరి 21 ఉదయం 10 గంటల వరకు ఈ-డిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేయవచ్చు.
లక్కీ డిప్లో ఎంపికైనవారు జనవరి 23 మధ్యాహ్నం 12 గంటలకు ముందు నగదు చెల్లించాలి.
జనవరి 22న కల్యాణోత్సవం, అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు; 23న రూ.300 ప్రత్యేక దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.


