హనుమకొండ: దాస్యం వినయ్ భాస్కర్ గారు మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, నాయకులు నరెడ్ల శ్రీధర్, పులి రజినీకాంత్, కొడకండ్ల సదాంత్, రమేష్ తో కలిసి హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు సోమవారం సాయంత్రం వెళ్లి కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ను కలిశారు
ఈ సందర్భంగా సీపీఐ వంద సంవత్సరాల బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ…
సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రోజున ఖమ్మం లో జరిగిన సీపీఐ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలు కూల్చాలని అనడాన్ని యావత్ తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు అలుపెరుగని ఉద్యమం, పోరాటం చేసిందని గుర్తు చేశారు.
తొమ్మిదిన్నర సంవత్సరాలల్లో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు.
తెలంగాణను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి కక్ష పెంచుకున్నాడని విమర్శించారు.
60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ కి దక్కుతుందని తెలిపారు.
ఆకాంక్షల పాలన బీఆర్ఎస్ ది అని, రాక్షస పాలన కాంగ్రెస్ ది అని విమర్శించారు.
తెలంగాణలో ఏ ఒక్క దిమ్మె కూలిన మహిమ గల మహబూబాబాద్ రాళ్ళతో కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.
ప్రజలను డైవర్ట్ చేయడం మాని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన, ప్రతీకార పాలన సాగుతోందని అన్నారు.
రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ సభలో పాల్గొని మతిభ్రమించి మాట్లాడారని విమర్శించారు.
తెలంగాణ పార్టీ గద్దెలు కులుతాయంటే కాంగ్రెస్ పార్టీ మనుగడే ఉండదని హెచ్చరించారు.
మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పనితనం ఏందో తెలుస్తదని అన్నారు.
సమ్మక్క సారక్కల మీద ప్రమాణం చేసి ఇచ్చిన హామీలను అమలు చేశావా అని ప్రశ్నించారు.
నాగుర్ల వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ..
కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించామని అన్నారు.
తెలంగాణ ఉద్యమ పార్టీ గద్దెలు కూలగొట్టమని కాంగ్రెస్ నాయకులకు చెప్పి రెచ్చగొడుతునావా అని ప్రశ్నించారు.
రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలలో ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదని విమర్శించారు.
420 హామీలు, 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


