HomeWarangal Newsఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు

ఫైరింగ్ సాధనలో పాల్గొన్న పోలీస్ అధికారులు

Published on

spot_img

వార్షిక ఫైరింగ్ సాధనలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మూడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ సిబ్బందితో పాటు శాంతి భద్రతలకు చెందిన పోలీస్ అధికారులు గత రెండు రోజులుగా ధర్మసాగర్ మండల కేంద్రం శివారు ప్రాంతంలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఫైరింగ్ రేంజ్‌లో ఫైరింగ్ సాధన చేస్తున్నారు.

ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్‌తో పాటు, డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఆర్.ఐలు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోని వివిధ రకాల తూపాకులతో సాధన చేసారు.

Warangal Police Commisioner
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ రాబోవు రోజుల్లో ఈ ప్రాంతాన్ని ఫైరింగ్ సాధన చేసేందుకుగాను మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో ముచ్చటించారు.

అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ ఫైరింగ్ సాధనలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు.

ఈకార్యక్రమములో డిసిపిలు అంకిత్ కూమార్, దార కవిత, రాజమహేంద్రనాయక్, ఏ.ఎస్పీలు చేతన్, శుభం, ట్రైనీ ఐపిఎస్ మనీషా నేహ్రా, అదనపు డిసిపిలు సురేష్‌కుమార్, రవి, రాయల ప్రభాకర్ రావు, శ్రీనివాస్, బాలస్వామి పాల్గొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles