HomeWarangal Newsఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Published on

spot_img

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన మహిళా కానిస్టేబుల్ అనిత (పేరు మార్చబడింది) నాలుగేళ్లుగా తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ డిమాండ్ చేయడం, ఇతరులతో సామాన్యంగా మాట్లాడకూడదని బెదిరించడం వంటి వేధింపులకు గురిచేసిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన దూరపు బంధువు రాజేందర్ వైఖరి నచ్చకపోవడంతో అనిత తల్లిదండ్రులు ఆ వివాహాన్ని నిరాకరించారు.

అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు గమనించిన రాజేందర్, జబ్బార్ లాల్‌కు ఫోన్ చేసి అనిత గురించి తప్పుడు సమాచారం అందించాడు. దాంతో జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడం ప్రారంభించాడు. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరించసాగాడు.

ఇద్దరి వేధింపులు తాళలేకపోయిన అనిత, రాజేందర్‌కు ఫోన్ చేసి “మీ ఇద్దరి వల్ల నా జీవితం నాశనమైంది, చావే దిక్కు” అని కన్నీరుమున్నీరుగా చెప్పింది. “చస్తే చావు” అని రాజేందర్ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో, అనిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

రాజేందర్, జబ్బార్ లాల్ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles