భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) సిట్ జారీ చేసిన నోటీసులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంటి గోడలపై నోటీసులు అంటించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ఈ అంశంపై కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో సిట్‌కు కూడా ఆరు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో సుప్రీంకోర్టుకు సంబంధించిన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
చట్టపరమైన అభ్యంతరాలు ఉన్నప్పటికీ, రేపు నంది నగర్లో జరగనున్న సిట్ విచారణకు తాను హాజరవుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.
సిట్ నోటీసులు జారీ చేసిన తీరు, వాటిని అందజేసిన పద్ధతిపై తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని, అయినా చట్టబద్ధంగా సహకరిస్తానని ఆయన లేఖల ద్వారా తెలియజేశారు.


