హనుమకొండ జిల్లా :
హంటర్ రోడ్డు న్యూ శాయంపేటలో భార్య కుటుంబికులపై నిన్న రాత్రి కత్తితో దాడి చేసిన భర్త.
గత కొంత కాలంగా భర్త కు దూరంగా ఉంటున్న భార్య.
ఇదే ప్రాంతానికి చెందిన కుడికాల అఖిల్, సజ్విత
మూడు సంవత్సరాల క్రితం తన టెన్త్ క్లాసుమేట్ సజ్విత ను ప్రేమ వివాహం చేసుకున్న అఖిల్.
వీరికి రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
గత రెండు సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండటంతో,
సజ్విత భర్తకు దూరంగా ఉంటూ హైదరాబాదులో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ప్రస్తుతం ఆమె తన తల్లి ఇంట్లో నివాసం ఉంటోంది.
ఈ నేపథ్యంలో అఖిల్ కత్తిని వెంట తీసుకొని భార్య వద్దకు వెళ్లి గొడవకు దిగాడు.
ఈ గొడవను ఆపేందుకు సజ్విత తల్లి సునీత మరియు సోదరుడు గుండు రామన్ ప్రయత్నించగా,
కోపోద్రిక్తుడైన అఖిల్ వారిపై కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో గుండు రామన్ మరియు సునీతకు తీవ్ర గాయాలు.
గాయపడిన వారిని వెంటనే సుబేదారిలోని రోహిణి హాస్పిటల్‌కు తరలింపు.
కుడికాల .అఖిల్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సుబేదారి పోలీసులు.


