HomePoliticsశిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన సన్మానం – కార్యక్రమంలో కడియం శ్రీహరి, కడియం...

శిల్పకళ వేదికలో సీఎం రేవంత్ రెడ్డికి ఘన సన్మానం – కార్యక్రమంలో కడియం శ్రీహరి, కడియం కావ్య

Published on

spot_img

హైదరాబాద్, మార్చి 6: ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్‌లోని శిల్పకళ వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు.

ఈ సందర్భంగా దేశంలోనే మొదటిసారిగా ఎస్సి వర్గీకరణకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, దాదాపు 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎస్సి వర్గీకరణ సమస్యకు సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో పరిష్కారం తీసుకువచ్చిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు.

ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు చట్టబద్ధత కల్పించేందుకు సీఎం కృషి చేశారని తెలిపారు.

మాదిగ మరియు మాదిగ ఉపకులాలు చేసిన మేలును ఎప్పటికీ మర్చిపోని గొప్ప జాతి అని పేర్కొన్నారు.

మంచి చేసిన వారిని గౌరవిస్తామని, చెడు జరిగితే ఎదురు తిరుగుతామని స్పష్టం చేశారు.

కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నారని ఆయన అభినందించారు.

పేద వర్గాల అభివృద్ధికి విద్య, వైద్యం, సంక్షేమం అత్యంత కీలకమని పేర్కొన్నారు. నాణ్యమైన విద్య అందిస్తే దళిత పిల్లలు ఎవరికీ తీసిపోరని స్పష్టం చేశారు.

సమాజంలో అసమానతలు తొలగాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

విద్య అంటే కేవలం భవనాలు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, ఉపాధ్యాయులు కలిసి విద్యకు మూలస్తంభాలని తెలిపారు.

దళిత సంక్షేమం మరియు విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత కృషి చేస్తే తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles

కాంగ్రెస్ భూ స్కామ్‌లు, 22A దుర్వినియోగంపై BRS ధ్వజం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ పార్టీ భూ అక్రమాలు మరియు 22A నిబంధనల దుర్వినియోగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

కాంగ్రెస్, BRSలపై ఫైర్ అయిన బీజేపీ నేత రామచందర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్, BRS పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసి, వీధి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత ఎన్. రామచందర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే ఆ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వారి వైఖరిని చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కొండా సురేఖను బీఆర్‌ఎస్‌లోకి రానివ్వం: జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను బీఆర్‌ఎస్ పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. కొండా సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వబోమని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.