సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.
టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగించాలని సుప్రీంకోర్టు సూచించింది.


