కాజీపేట-వరంగల్ రైల్వే మార్గంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
షాయంపేట గేటు సమీపంలో సింహపురి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న సుమారు 35 ఏళ్ల వ్యక్తి, ప్రమాదవశాత్తు రైలు నుంచి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.


