ఖమ్మం: ఖమ్మంలో జరిగిన ఒక గృహప్రవేశ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా జరగాల్సిన వేడుకలో ఒక మహిళ హఠాన్మరణం చెందడం స్థానికంగా కలకలం రేపింది.
ఖమ్మంలోని గాంధీచౌక్కు చెందిన సుష్మిత (40) అనే మహిళ, నగరంలో జరిగిన ఒక గృహప్రవేశ వేడుకకు హాజరయ్యారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, వారితో కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఆమె మృతి చెందారు. దీంతో వేడుకకు వచ్చిన వారంతా తీవ్ర షాక్కు గురయ్యారు.
సుష్మిత కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. మృతురాలికి బిటెక్ చదువుతున్న కుమారుడు ఉన్నాడు.


