తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం, GSDP గణనీయంగా తగ్గిందని ఆయన ఆరోపించారు.
BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉండగా, కాంగ్రెస్ పాలనలో అది 10.2% కి పడిపోయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల అమలు విషయంలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుత బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ “చేతకానితనం” అర్థమవుతోందని, ఇది ‘క్యూర్, ప్యూర్, రేర్’ విధానం కాదు, కేవలం ‘చోర్’ విధానమని ఎద్దేవా చేశారు.


