HomeWarangal Newsవరంగల్‌లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

వరంగల్‌లో రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ

Published on

spot_img

వరంగల్, మార్చి 21 (2026):

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన రంజాన్ వేడుకల్లో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

మట్టేవాడ, ఎల్బీ నగర్, ఖిలా వరంగల్ ప్రాంతాల్లోని ఈద్గాల్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముస్లిం సోదర, సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడారు.

పవిత్ర రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఆచరించి ఆధ్యాత్మికతతో పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Ramzan Prayers

ఈద్గాల్లో ప్రార్థనల్లో పాల్గొనడం తనకు ఆనందాన్ని కలిగించిందని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అల్లాను ప్రార్థించినట్లు తెలిపారు.

అభివృద్ధి & సంక్షేమ కార్యక్రమాలు

ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రకటించారు:

Konda Surekha

ఈద్గా అభివృద్ధికి నిధులు

మట్టేవాడ ఈద్గా – ₹1 కోటి

ఖిలా వరంగల్ ఈద్గా – ₹1 కోటి

ఎల్బీ నగర్ ఈద్గా – ₹60 లక్షలు

చింతల్ ఈద్గా – ₹40 లక్షలు

సంక్షేమ కార్యక్రమాలు

400 కుట్టు మిషన్‌ల పంపిణీ

రంజాన్ తోఫా కింద 3,500 కిట్ల పంపిణీ

మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, రంజాన్ వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.

Latest articles

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి: జీడబ్ల్యూఎంసీ కమిషనర్

వడ్డేపల్లి బండ్ సుందరీకరణ, ఫుడ్ స్ట్రీట్ నిర్మాణ పనులను జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న పరిశీలించి, నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

క్యాన్సర్ బాధిత బాలుడి చికిత్సకు రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

క్యాన్సర్‌తో బాధపడుతున్న హనుమకొండకు చెందిన మహ్మద్ ఆదిల్ అహ్మద్ చికిత్స కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య రూ.5 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు.

వరంగల్ మండి బజార్‌లో హోటళ్లపై ఆహార భద్రత అధికారుల తనిఖీలు

వరంగల్ మండి బజార్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రతాధికారులు తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన చికెన్‌ను గుర్తించారు.

వైఎస్సార్ నగర్ గుడిసెవాసుల అరెస్టులపై దాస్యం వినయ్ భాస్కర్ ఖండన

కాజీపేట వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు, మహిళల అరెస్టులను దాస్యం వినయ్ భాస్కర్ ఖండించారు.
spot_img

Related Articles