హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో (KU) భీమ్ దీక్షలో భాగంగా నిర్వహించిన ‘జ్ఞాన ముగ్గుల’ కార్యక్రమం ఆకట్టుకుంది. విద్యార్థినులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్సిటీ ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేసి సందడి చేశారు.
భీమ్ దీక్ష వేడుకల నేపథ్యంతో కూడిన వినూత్నమైన ముగ్గులతో మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారు. కేయూ హాస్టల్స్ డైరెక్టర్ శ్రీనివాస్ మరియు స్వేరోస్ నేతలు ఈ ముగ్గుల పోటీలను స్వయంగా పరిశీలించి, పాల్గొన్న వారిని అభినందించారు. ఈ కార్యక్రమంతో కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.


